అనుమతి లేని 8 ఇసుక లారీలు పట్టివేత

MDK: అనుమతి లేకుండా అక్రమంగా కర్ణాటకకు తరలిస్తున్న 8 ఇసుక లారీలను పట్టుకున్నట్లు హద్నూర్ ఎస్సై రాజశేఖర్ సోమవారం తెలిపారు. న్యాల్కల్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులోని రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని చెక్ పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమతి లేకుండా అక్రమంగా కర్ణాటకకు తరలిస్తున్న లారీలను పట్టుకున్నామన్నారు. అనంతరం లారీలను పోలీస్ స్టేషన్‌కు తరలించామన్నారు.