ఈ ప్రాంతాల్లో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు

ఈ ప్రాంతాల్లో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు

కోనసీమ: అమలాపురం సబ్ డివిజన్ పరిధిలో ఏప్రిల్ నెలలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. ముందుస్తు అనుమతి లేకుండా ఎవరైనా అమలాపురం, ముమ్మిడివరం, రామ చంద్రపురం నియోజకవర్గాల పరిధిలో సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించకూడదని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు సహకరించాలని వారు కోరారు.