ఫిర్యాదులపై నిర్లక్ష్యం.. ఉన్నతాధికారుల యాక్షన్ ఎక్కడ..?
MDCL: ఉప్పల్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలో ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులపై అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. గార్బేజి, శానిటేషన్, రోడ్ల గుంతలు తదితర ఫిర్యాదుల పై అధికారులు నెలల తరబడి కాలక్షేపం చేస్తున్నారు. ఉన్నతాధికారులు యాక్షన్ తీసుకోకపోవడం, పనులను రివ్యూ చేయకపోవడంతో ప్రజలకు సత్వర పరిష్కారం దొరకటం లేదు.