గుంటూరు పశ్చిమలో ఘనంగా అమరావతి సంబరాలు
GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆధ్వర్యంలో శ్రీనివాసరావు పేటలోని టీడీపీ కార్యాలయంలో అమరావతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేకంగా రూపొందించిన అందమైన ముగ్గు వద్ద మహిళలు ఉత్సాహంగా పాల్గొని సంబరాల్లో భాగమయ్యారు.