మొదటి మహిళా డీసీసీ అధ్యక్షురాలిగా ఆంక్షారెడ్డి
SDPT: 2014లో జిల్లా ఏర్పడిన తర్వాత మూడు సార్లు డీసీసీ కమిటీ ఏర్పడింది. అందులో మొదటి, 2వ సారి తూంకుంట నర్సారెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా వ్యవహారించారు. 3వసారి ఆయన కూతురైన ఆంక్షారెడ్డికి ఈ పదవి వరించింది. కాగా, జిల్లాకు మొదటిసారిగా ఒక మహిళా డీసీసీ అధ్యక్షురాలిగా వ్యవహారించనున్నది. జిల్లా వ్యాప్తంగా పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలను ఆమె ఎలా పరిష్కరిస్తారో చూడాలి మరి!