'త్వరలోనే 'ఈ కవర్డ్ కండక్టర్' ప్రాజెక్టు పనులు ప్రారంభం'
మంచిర్యాల జిల్లాలోని వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని SE రాజన్న ఒక ప్రకటనలో తెలిపారు. అటవీ ప్రాంతాల గుండా వెళ్లే తీగలతో తరచూ ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతుండటంతో వీటిని అధిగమించాలని 'ఈ కవర్డ్ కండక్టర్' ప్రాజెక్టును చేపట్టారు. త్వరలోనే ఇక్కడ పనులు మొదలుకానున్నాయని అవి పూర్తయితే సరఫరాలో అంతరాయాలు తగ్గుతాయన్నారు.