'ఈనెల 20 వరకు దరఖాస్తుల ఆహ్వానం'
SGR: పాలీసెట్ ప్రవేశ పరీక్ష కోసం ఈనెల 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సంగారెడ్డి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ జానకి దేవి తెలిపారు. పదో తరగతి పరీక్ష రాసిన వారు www.polycet.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని కోరారు. పాలిటెక్నిక్లో విద్యార్థులకు ఉపాధి కల్పించిన కోర్సులు ఉన్నాయని పేర్కొన్నారు.