రోడ్లపై నీటిని తొలగిస్తున్న అధికారులు

రోడ్లపై నీటిని తొలగిస్తున్న అధికారులు

కృష్ణా: 'మొంథా' తుఫాను కారణంగా విజయవాడ నగర వ్యాప్తంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో, బుధవారం ఉదయం మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు. వారు డ్రైనేజీ మ్యాన్ హోల్స్‌ నుంచి ట్యాంకర్లు, మోటర్ల సహాయంతో రోడ్లపై నిలిచిన నీటిని యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు. రోడ్లు జలమయం కావడంతో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.