అభివృద్ధికి మార్గదర్శిగా రాజీవ్ గాంధీ

అభివృద్ధికి మార్గదర్శిగా రాజీవ్ గాంధీ

MNCL: మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ అభివృద్ధికి మార్గదర్శిగా నిలిచారని కాంగ్రెస్ పార్టీ లక్షెట్టిపేట మండల అధ్యక్షులు పింగళి రమేష్, పట్టణ అధ్యక్షులు ఆరిఫ్ అన్నారు. రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని బుధవారం లక్షటపేట పట్టణంలోని స్థానిక ఐబీలో కాంగ్రెస్ నాయకులతో కలిసి వారు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.