బస్సు ప్రమాద ఘటన DY.CM పవన్ దిగ్భ్రాంతి
ASR: అల్లూరి జిల్లాలో జరిగిన ఘటనపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 'ఈ దుర్ఘటనలో 22 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించడమైనది. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుంటుంది' అని పేర్కొన్నారు.