'చిత్తూరు జిల్లాకు రెడ్ అలర్ట్ '

'చిత్తూరు జిల్లాకు రెడ్ అలర్ట్ '

CTR: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ చిత్తూరు జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ టెలికాన్ఫరెన్స్ ద్వారా తెలిపారు. జిల్లాలో వర్షాల ప్రభావాన్ని సమీక్షించిన కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.