పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే

SRPT: పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే సామేలు అన్నారు. శుక్రవారం తుంగతుర్తి మండలం బండరామారంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి మాట్లాడారు. పేదింటి సొంతింటి కలను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క కుటుంబానికి రేషన్ కార్డు, ఇళ్లు ఇవ్వలేదన్నారు.