బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు: ఎంపీడీఓ
ADB: బాలలకు సురక్షితమైన వాతావరణాన్ని అందించేందుకు బేల మండల స్థాయి బాలల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపీడీఓ ఆంజనేయులు తెలిపారు. ఏర్పాటు చేసిన ఈ కమిటీ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, బాల కార్మికులు, బాల్య వివాహాలు లేని మండలంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.