రేపు కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే అమిలినేని పర్యటన
ATP: ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు శనివారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 7 గంటలకు మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. అనంతరం ప్రభుత్వ బాలికల హాస్టల్ సమీపంలో బొమ్మగానిపల్లి గ్రామానికి నిర్మించనున్న తారు రోడ్డు పనులకు భూమిపూజ చేస్తారు.