శబరి నదిలో వెంకట రమణ మృతదేహం లభ్యం
ASR: చింతూరు సమీపంలోని శబరి నదిలో ఆదివారం స్నానానికి దిగి గల్లంతైన వెంకట రమణ మృతదేహం మంగళవారం లభ్యమైంది. గత మూడు రోజులుగా ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు చేసిన గాలింపు చర్యల అనంతరం ఇవాళ మృతదేహం దొరికింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కాగా, వెంకట రమణ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.