VIDEO: 'స్కాలర్షిప్ బకాయిలు వెంటనే చెల్లించాలి'

KNR: తెలంగాణ రాష్ట్ర బీసీ యువజన సంఘం పిలుపు మేరకు కరీంనగర్ బీసీ సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ముందు నిరసన ధర్నా నిర్వహించారు. విద్యార్థుల ప్రధాన సమస్యలను పరిష్కరించాలంటూ ర్యాలీ నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని, ఫీజు నియంత్రణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.