భక్తుడి ప్రాణాలు కాపాడిన స్విమ్మర్
BDK: భద్రాచలంలో జరుగుతున్న రామయ్య కళ్యాణం ఉత్సవాల్లో పాల్గొన్న కొంతమంది యువకులు గోదావరిలో స్నానానికి వెళ్లారు. నది ఒడ్డున స్నానం చేస్తుండగా ఓ యువకుడు లోతు తెలియక గోదావరిలో మునిగిపోయాడు. తోటి యువకులు గట్టిగా కేకలు వేశారు. సమీపంలోనే ఉన్న స్విమ్మర్ ప్రసాద్ వెంటనే నదిలోకి దూకి యువకుడి ప్రాణాలు కాపాడాడు. యువకుడు అపస్మారక స్థితిలో ఉండడంతో సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలించారు.