KTRను కలిసిన సౌత్ సెంట్రల్ రైల్వే ప్రతినిధులు
HYD: తెలంగాణ భవన్‌లో మాజీమంత్రి KTRను సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. కాజీపేట్ కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు, సౌత్ సెంట్రల్ రైల్వే SEC జోన్‌ను రెండు జోన్లుగా విభజించిన నేపథ్యంలో జోన్ల విభజన ప్రక్రియలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను KTRకు వివరించారు.