సరస్వతీ పుష్కరాలపై మంత్రుల సమీక్ష

సరస్వతీ పుష్కరాలపై మంత్రుల సమీక్ష

TG: సరస్వతీ పుష్కరాలపై మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు. పుష్కరాలకు రోజూ లక్షన్నర మంది భక్తులు వస్తారని.. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. భక్తులకు వసతి, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించాలని చెప్పారు. కాగా.. ఈనెల 15 నుంచి 26 వరకు సరస్వతీ పుష్కరాలు జరగనున్నాయి.