VIDEO: ఒంటిమిట్ట కోదండ రామాలయం మూసివేత
KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయ స్వామి దేవాలయం మంగళవారం చంద్రగ్రహణం కారణంగా మూసి వేశారు. ఆలయ టీటీడీ తనిఖీ అధికారి నవీన్ కుమార్ సమక్షంలో ఉదయం 9 గంటలకు గర్బాలయం, అంతరాలయం, ఆలయ ప్రధాన గోపురం ద్వారాలు మూసి ముద్రణ వేశారు. తిరిగి రాత్రి 7 గంటలకు ఆలయ శుద్ధి అనంతరం భక్తులను స్వామి దర్శనానికి అనుమతించనున్నట్లు ఇన్స్ పెక్టర్ నవీన్ కుమార్ తెలిపారు.