VIDEO: ఆ గ్రామాల మధ్య రాకపోకలు బంద్

KNR: నిన్న కురిసిన భారీ వర్షానికి సోమారం, బూడిదపల్లి, గర్రెపల్లి, వెన్నంపల్లి, లస్మన్నపల్లి, ఎక్లాస్పూర్, ఆరెపల్లి గ్రామాలు అతలాకుతలం అయ్యాయి. బూడిదపల్లి, సోమారం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. లోలెవెల్ బ్రిడ్జ్‌పై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సైదాపూర్- మొలంగూర్ ప్రధాన రహదారిపైనా ప్రయాణికులు వరద ప్రభావంతో ఇబ్బందులు పడుతున్నారు.