పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది: కలెక్టర్
VKB: గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతుందని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిని ఆయన కలెక్టరేట్ నుంచి అధికారులతో కలిసి వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉదయం 9 గంటల వరకు 20 శాతంపైగా పోలింగ్ నమోదయిందని వెల్లడించారు.