'ఆదర్శ పాఠశాలను సందర్శించిన కలెక్టర్'

'ఆదర్శ పాఠశాలను సందర్శించిన కలెక్టర్'

PDPL: ముత్తారం మండలం దరియాపూర్ తెలంగాణ ఆదర్శ పాఠశాలను కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇవాళ సందర్శించారు. రూ.కోటి నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. అదనపు పనుల కోసం మరిన్ని నిధులు అవసరమైతే అంచనాలు సిద్ధం చేసి పంపాలని తెలిపారు. అంచనాలు అందగానే నిధులు విడుదల చేస్తామని పేర్కొన్నారు.