రాష్ట్రంలోనే పెద్ద మున్సిపాలిటీల్లో ప్రొద్దుటూరు..!
కడప: రాష్ట్రంలోని పెద్ద మున్సిపాలిటీల్లో ప్రొద్దుటూరు చేరనుంది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో వార్డుల సంఖ్యను పెంచుతూ బుధవారం CDMA ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు 52 వార్డులతో రాష్ట్రంలోనే అతి పెద్ద మున్సిపాలిటీలుగా పొద్దుటూరు, తెనాలి, హిందూపురం, నంద్యాల, ఆదోని అవతరించనున్నాయి. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 2011 లెక్కల ప్రకారం 1,80,584 మంది జనాభా ఉంది.