రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
SRPT: కోదాడ పట్టణ పరిధిలోని లారీ ఆఫీస్ ఎదురుగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని డీసీఎం ఢీ కొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఇద్దరిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డీసీఎం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.