జిల్లాలో రేపటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు

నాగర్ కర్నూల్ జిల్లాలో ఈనెల 14 నుంచి అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో వారోత్సవాలకు సంబంధించిన గోడపత్రిక ఆవిష్కరించారు. 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తారు. ఈ వారోత్సవాల్లో భాగంగా అగ్ని ప్రమాదాలు నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు.