పంపు హౌస్ వద్ద కాంట్రాక్టు కార్మికుల ధర్నా

పంపు హౌస్ వద్ద కాంట్రాక్టు కార్మికుల ధర్నా

PDPL: అంతర్గాం మండలం మూర్ముర్ పంప్ హౌస్ వద్ద కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా నిర్వహించారు. 4 నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ నేత ఎం. రామాచారి డిమాండ్ చేశారు. జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వారం రోజులుగా సమ్మె చేస్తున్నా, స్పందన లేదని మండిపడ్డారు. పూర్తి వేతనాలు చెల్లించే వరకు విధులకు హాజరయ్యేదిలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.