అగ్ని ప్రమాదం..తప్పిన పెను ప్రమాదం
కాకినాడ: పెద్దాపురం అగ్నిమాపక బృందం కృషితో పెద్దాపురం దర్గా సెంటర్ ప్రాంతానికి ముప్పు తప్పింది. స్థానిక దర్గా సెంటర్ కలప దుకాణంలో మంగళవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక బృందం సకాలంలో చేరుకొని మంటల్ని అదుపు చేసింది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో పెట్రోల్ బంకు కూడా ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందారు