దర్శిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిర్మాణానికి పురోగతి
ప్రకాశం: దర్శి కేంద్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిర్మించేందుకు రూ.2 కోట్లు మంజూరు చేయాలని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు డాక్టర్ లక్ష్మీ వినతిపత్రం అందజేశారు. దర్శిని ప్రకాశం జిల్లాలో కొనసాగించడంపై మంత్రి గారికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతేకాక, నియోజకవర్గంలోని రెవెన్యూ సమస్యలు, భూ వివాదాలు, సిబ్బంది కొరత, అభివృద్ధిపై చర్చించారు.