మహమ్మద్ పురం పాఠశాలను సందర్శించిన ఎంఈఓలు
SKLM: జలుమూరు మండలం మహమ్మద్‌పురం ప్రభుత్వ పాఠశాలను ఎంఈఓలు బమ్మిడి మాధవరావు, ఎంవీఆర్‌ఎస్ ప్రసాదరావు గురువారం సందర్శించారు. పాఠశాల రికార్డులను పరిశీలించి ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. విద్యార్థులతో మాట్లాడి బోధన విధానాన్ని తెలుసుకున్నారు. నాణ్యమైన బోధన అందించడంతో పాటు మధ్యాహ్న భోజనం సక్రమంగా అమలు చేయాలని సూచించారు.