'ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి'
MDK: యాసంగి సీజన్‌లో రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని రామాయంపేట మండల వ్యవసాయ అధికారి రాజు నారాయణ అన్నారు. కోనాపూర్ గ్రామంలో మొక్కజొన్న పంటపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం ఆరుతడి పంటలను ప్రోత్సహించేందుకుగాను మొక్కజొన్న విత్తనాలు సబ్సిడీపై సరఫరా చేస్తుందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.