'కలిసికట్టుగా ఉద్యమించాలి'

NDL: కార్మికులు కర్షకులు కలసి కట్టుగా ఉద్యమించాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు శుక్రవారం నందికోట్కూరు మండలం కొణిదేల గ్రామంలో 139వ మేడే దినోత్సవం బెస్తరాజు అధ్యక్షతన జరిగింది. పార్టీ శాఖ కార్యదర్శి కొంగర వెంకటేశ్వర్లు జెండా ఆవిష్కరిoచారు. ఇందులో సీఐటీయూ జిల్లా నాయకులు గోపాలకృష్ణ, సీపీఎం నాయకులు పాల్గొన్నారు.