"గేట్"లో ర్యాంకు సాధించిన శ్రీచందనను అభినందించిన కలెక్టర్
నిజామాబాద్: 'గేట్' (GATE) అర్హత పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన జి. శ్రీచందనను కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అభినందించారు. భీమ్‌గల్ మండలం జాగిర్యాల్ గ్రామానికి చెందిన దేవేందర్, స్రవంతి దంపతుల కుమార్తె అయిన శ్రీచందన.. 81.67 శాతం మార్కులతో 302వ ర్యాంకు సాధించింది. శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ ఆమెను అభినందించారు.