మండలంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే

NDL: అవుకు మండలంలోని గుండ్ల సింగవరం గ్రామంలో బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి బుధవారం నాడు పర్యటించారు. అన్నవరం గ్రామానికి చెందిన మద్దిలేటి రెడ్డి సీఎంఆర్ మనస్విని మిల్క్ డైరీని నూతనంగా ఏర్పాటు చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మిల్క్ డైరీని ఘనంగా ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ తమ వ్యాపారాలలో ముందుకెళ్లాలని ఆయన అన్నారు.