వంతెన నిర్మించి కష్టాలు తీర్చండి

ASR: అనంతగిరి మండలంలోని పినకోటకు వెళ్లే దారిలో వంతెన నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. కురుస్తున్న అకాల వర్షాలకు నక్కులమామిడి పినకోటకు మధ్య ఉన్న కల్వర్టుపై వాగు పొంగి వరద నీరు ప్రవహిస్తుండడంతో గిరిజనులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని శనివారం తెలిపారు. ఈ విషయంపై అధికారులు స్పందించాలని వేడుకుంటున్నారు.