మాజీ మంత్రి కాకాణి విడుదలకు బ్రేక్

NLR: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విడుదల మరింత ఆలస్యం అయింది. హైకోర్టు ఇచ్చిన ప్రొసీజర్స్ పూర్తి చెయ్యడంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అంతేకాక పత్రాలు సమర్పించడంలో మరింత జాప్యం జరిగనట్లు తెలుస్తుంది. ఇవాళ విడుదలకు అవకాశం లేదని సమాచారం. వైసీపీ నేతలు బుధవారం ఉదయం జైలు అధికారులకు పత్రాలు సమర్పించనున్నారు. రేపు మధ్యాహ్నం తర్వాత కాకాణి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.