VIDEO: గరివిడిలో ఓపెన్ హౌస్ కార్యక్రమం
VZM: గరివిడి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా వారోత్సవాలు భాగంగా డీఎస్పీ రాఘవులు గోదావరి స్కూలు విద్యార్థులతో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల భద్రత, మహిళలపై జరిగే నేరాలు, వాటి నివారణ చర్యలు, పోలీస్ స్టేషన్ పనితీరుపై అవగాహన కల్పించారు. అలాగే, విద్యార్థులు పోలీస్ వ్యవస్థపై తమకున్న సందేహాలను అడిగి తెలుసుకున్నారు.