VIDEO: ప్రభుత్వ బడిలో అడ్మిషన్ల కోసం క్యూలైన్..!
NLG: ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు తమ పిల్లలను లక్షలు ఖర్చు పెట్టైనా.. పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్లలో చేర్పిస్తుంటారు. కానీ, నల్గొండ జిల్లా బొట్టాయగూడెంలో ప్రభుత్వ పాఠశాలలో చేరేందుకు అడ్మిషన్ల కోసం పోటీ పడుతున్నారు. కాగా ఈ పాఠశాలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన సొంత నిధులతో ఆయన కుమారుడైన ప్రతిక్ రెడ్డి పేరుతో ఓ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలను నిర్మించిన విషయం తెలిసిందే.