ఇరాన్‌కు అంత సీన్ లేదు: ట్రంప్
హర్మూజ్ జలసంధి ద్వారా వెళ్లే నౌకలను అడ్డుకుంటే దాడులు ఉద్ధృతం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఖర్గ్ ద్వీపంలోని సైనిక లక్ష్యాలపై ఇప్పటికే దాడులు చేశామన్నారు. ఇంధన కేంద్రాలపై కూడా దాడులు చేస్తామని వెల్లడించారు. అమెరికా దాడులను అడ్డుకునే సామర్థ్యం ఇరాన్‌కు లేదన్నారు. అమెరికా సైన్యాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ దళంగా తీర్చిదిద్దానని ట్రంప్ పేర్కొన్నారు.