మంచినీటి సరఫరాకు అంతరాయం
కృష్ణా: గుడివాడ పురపాలక సంఘం ప్రధాన పంపింగ్ మెయిన్ లైన్‌లో సాంకేతిక లోపం ఏర్పడి, పైప్‌లైన్ పగిలిపోయింది. ఈ కారణంగా గుడ్‌మెన్‌పేట, బంటుమిల్లి రోడ్, ఆర్టీసీ కాలనీ, శాంతినగర్ రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాలకు ఇవాళ తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని మున్సిపల్ కమిషనర్ మనోహర్ తెలిపారు. ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.