రేపు రెబ్బెనలో రేషన్ కార్డుల పంపిణీ

రేపు రెబ్బెనలో రేషన్ కార్డుల పంపిణీ

ASF: రెబ్బెన మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రెబ్బెన మండల తహశీల్దార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నూతన రేషన్ కార్డులు లబ్ధిదారులు రైతు వేదికలో హాజరు కావాలని కోరారు. ప్రజాప్రతినిధుల సమక్షంలో రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందన్నారు.