తెల్ల ఉల్లితో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు
ఎర్ర ఉల్లిపాయల కంటే తెల్ల ఉల్లి ధర ఎక్కువగా ఉంటుంది. ఇందులోని పోషకాలు, వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలే ఇందుక్కారణంగా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. తెల్ల ఉల్లిలోని పోషకాలు ఇమ్యూనిటీని మెరుగుపరచడంతో పాటు రక్తపోటు, షుగర్‌ని నియంత్రిస్తాయి. జీర్ణ సంబంధిత సమస్యలనూ నిరోధిస్తాయి. తెల్ల ఉల్లి రసం చర్మ, కేశ సంరక్షణలోనూ ప్రధాన పాత్ర పోషిస్తుంది.