జాగ్రత్త.. నమ్మించి నట్టేట ముంచేది వాళ్లే..!

జాగ్రత్త.. నమ్మించి నట్టేట ముంచేది వాళ్లే..!

HYD: మహానగరంలో సామాజిక మాధ్యమాల ద్వారా ఏర్పడుతున్న పరిచయాలు ప్రేమ, పెళ్లి పేరుతో ప్రమాదకర మలుపులు తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇల్లు వదిలి పారిపోతున్న ఘటనలు పెరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా పోక్సో కేసుల్లో 85 శాతం మంది నిందితులు బాధితులకు తెలిసిన వారేనని, పరిచయం ఉన్నవారే నమ్మించి, మోసం చేస్తున్నారని అధికారులు హెచ్చరిస్తున్నారు.