VIDEO: చదువుని నిర్లక్ష్యం చేయవద్దని బాలుడికి కలెక్టర్ సూచన

VIDEO: చదువుని నిర్లక్ష్యం చేయవద్దని బాలుడికి కలెక్టర్ సూచన

ASF: దహేగాం పర్యటనలో భాగంగా కలెక్టర్ హరిత మార్గమధ్యంలో ఐనం వద్ద రోడ్డుపై ఉన్న ఓ బాలుడిని గమనించి తన వాహనాన్ని ఆపి ఆప్యాయంగా పలకరించారు. “బాబు బడికి వెళ్తున్నావా?” అని అడగగా, ఆ బాలుడు తన ఒంటిపై దురద సమస్య ఉండటంతో శనివారం బడికి వెళ్లలేకపోయానని చెప్పాడు. స్పందించిన కలెక్టర్ ఆరోగ్యం కాపాడుకుంటూ చదువుని నిర్లక్ష్యం చేయవద్దని బాలుడికి సూచించారు.