VIDEO: పన్నులు వసూళ్లను పరిశీలించిన DLPO

VIDEO: పన్నులు వసూళ్లను పరిశీలించిన DLPO

ప్రకాశం: టంగుటూరు గ్రామ పంచాయతీలో సాగుతున్న ఇంటి పన్ను, ఇతర పన్నుల వసూలు ప్రక్రియను ఒంగోలు DLPO పద్మ ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వసూలు బృందాలతో మాట్లాడి, వారికి నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న పన్నులను వేగంగా వసూలు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, తదితర సిబ్బంది పాల్గొన్నారు.