'వైన్ షాపుల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి'

'వైన్ షాపుల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి'

కడపలో నేరాల నియంత్రణకు బార్లు, వైన్‌ షాపుల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని డీఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు. ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం నగరంలోని పలు షాపుల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, అవి నిరంతరం పనిచేసేలా చూడాలని, విక్రయాల్లో సమయపాలన పాటించాలని, రౌడీలు, అనుమానితులు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.