VIDEO: ఇంట్లోకి ప్రవేశించిన నాగుపాము

VIDEO: ఇంట్లోకి ప్రవేశించిన  నాగుపాము

కోనసీమ: అమలాపురం మండలం పరిధిలోని పేరూరులో దూళ్ల వారి వీధిలో ఒక ఇంట్లో శుక్రవారం నాగుపాము ప్రవేశించింది. దీంతో అక్కడి వ్యక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై స్నేక్ క్యాచర్ వర్మకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న వర్మ పామును చాకచక్యంగా బంధించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాములు కనిపిస్తే ఎవరు వాటిని చంపవద్దని తనకు సమాచారం అందించాలని కోరారు.