నేడు పాడేరులోని విద్యాలయాలకు సెలవు
ASR: ఇవాళ పాడేరులో బిర్సాముండ జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. 16న ఒరిస్సా సీఎం మోహన్ చరణ్ మాఝీ పాడేరులో పర్యటించనున్నారు. భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా శనివారం(నేడు) పాడేరులోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. డిగ్రీ, జూనియర్ కళాశాలలు, సెయింట్ ఆన్స్ స్కూల్, నక్కలపుట్టు యూపీ పాఠశాల, ఆశ్రమ పాఠశాలలకు సెలవు ప్రకటించారు.