VIDEO: MCHలో విద్యుత్ వృథా
MBNR: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి (MCH) భవనంలో పరిస్థితులు దారుణంగా మారాయి. ఆస్పత్రిలో గర్భిణులు, బాలింతల పరీక్షల తర్వాత కూడా ఫ్యాన్లు, లైట్లు వృథాగా పనిచేస్తున్నాయని రోగుల బంధువులు తెలిపారు. ప్రధానంగా విద్యుత్ ఉపకరణాల వినియోగంపై నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలైనా ఆపేవారు లేకపోవడం వల్ల ప్రజాధనం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.