VIDEO: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
అన్నమయ్య: రాజంపేట(M)లోని బ్రాహ్మణపల్లి సబ్‌స్టేషన్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దువ్వూరు శివకృష్ణ (35) అనే వ్యక్తి మృతి చెందాడు. పని నిమిత్తం బ్రాహ్మణపల్లి నుంచి రాజంపేటకు వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.